Welcome to Our Seema ft. RANABAAL | Director Rahul Sankrityan, Vijay Deverakonda & Rashmika Mandanna
Director

Rama Rao P.V.
Director

Neelam Sai Rajesh
Director

Samudra Rao Vankadari
Director

Vijay Bhaskar Reddy Somala
L/M-Co

A. Prabhu (Prabhakara Rao)
L/M-Co

A. Krishna Mohan
Director

Balaji Cherukuri
L/M-Co

Raja Vannem Reddy
Director

Antharvedi Subrahmanyam (Sunil)
Asso-Director

Kolanu Sailesh
Director

Konda Vijay Kumar
Director

Saagar Maram (Sagar K Chandra)
Director

Sriram Aditya Turlapati
Director

Talatam Mallika
Asso-Director

Anjibabu Gunturu
L/M-Co

U. Alla Bakash
L/M-Asst

Maviti Sai Surendra Babu
Director

Mogili Ramana Rao
Director

Pallikonda Sumathi Priyadarsini
L/M-Asso
My journey started with him. The very first dialogue I ever wrote in this industry was for his film.

Telugu Film Directors Association
7/10/2026, 6:58:00 am
TFDA సభ్యులకు కుటుంబాలకు orthepedic సంబంధించిన హెల్త్ చెకప్స్ చేయించునే సౌలభ్యాన్ని తీసుకువచ్చాము. ఇదివరకటిలాగానే total body checkup ఫెసిలిటీ తో పాటుగా ఎముకలకి వెన్నెముకకి సంభందిచిన స్క్రీనింగ్ టెస్టులు, కన్సల్టేషన్స్ మరియు అవసరమైన సర్జరీలకు సంబంధించిన ఫెసిలిటీస్ గచ్చిబౌలి లోని LUX hospitals మన యూనియన్ సభ్యులకు మరియు డిపెండెంట్స్ కు ఫెసిలిటీ కల్పించనున్నారు. LUX హిస్పిటల్స్ అధినేత ఆర్థోపెడిక్ సర్జన్ Dr. Sai Kishan Sirasala మనకు యూనియన్ సభ్యులకి అందివ్వడానికి సహృదయంతో అంగీకటించారు. ఈ అవకాశాన్ని అవసరం ఉన్నవారు ఉపయోగించుకోగలరు మీరు చేయాల్సినది కూపన్ పైన ఉన్న ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకోండి. వారు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున మన TFDA మెంబర్షిప్ కార్డ్ మరియు మీ ఆధార్ కార్డ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కు టెస్ట్ లు అవసరం ఉంటె వారి ఆధార్ కార్డ్ కూడా తీసుకుని వెళ్లండి. మీరు అక్కడికి వెళ్లిన తరువాత హాస్పిటల్ వారు గైడ్ చేస్తారు. - VN ఆదిత్య - ప్రెసిడెంట్ TFDA
Open News →

Telugu Film Directors Association
5/10/2026, 6:19:00 pm
TFDA సభ్యులకు కుటుంబాలకు మళ్లీ హెల్త్ చెకప్స్ చేయించునే సౌలభ్యాన్ని తీసుకువచ్చాము. ఇదివరకు total body checkup ఫెసిలిటీ ఇచ్చిన మియాపూర్ శ్రీకర హాస్పిటల్ వారు తిరిగి మళ్లీ మన యూనియన్ సభ్యులకు అదే ఫెసిలిటీ కల్పించనున్నారు. శ్రీకర హిస్పిటల్స్ వారు మళ్లీ మనకు ఇచ్చిన అవకాశాన్ని అవసరం ఉన్నవారు ఉపయోగించుకోగలరు మీరు చేయాల్సినది కూపన్ పైన ఉన్న ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకోండి. వారు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున మన TFDA మెంబర్షిప్ కార్డ్ మరియు మీ ఆధార్ కార్డ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కు టెస్ట్ లు అవసరం ఉంటె వారి ఆధార్ కార్డ్ కూడా తీసుకుని వెళ్లండి. మీరు అక్కడికి వెళ్లిన తరువాత హాస్పిటల్ వారు గైడ్ చేస్తారు. - VN ఆదిత్య - ప్రెసిడెంట్ TFDA
Open News →

Telugu Film Directors Association
30/9/2026, 1:13:00 pm
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి* ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో.. హీరో ఫాహద్ ఫాజిల్ మాట్లాడుతూ ‘‘ఇంత అభిమానం ఎప్పుడూ చూడలేదు. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. 90 శాతం లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. చాలా మంచి ఫీల్ కలిగింది. ఈ సినిమా షూటింగ్ లో దర్శక నిర్మాతలు, సినిమా యూనిట్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. నిజంగా బాగా ఎంజాయ్ చేస్తూ పని చేశాం. ఈ సినిమా మొదలైనప్పుడే మీ సపోర్ట్ మాకు దొరికింది. మీరు ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 2 న మా సినిమా చూడండి’’ అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ సారా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు చాలా థాంక్స్. ఫాఫా తో పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అక్టోబర్ 2న అందరూ ఈ సినిమా చూడండి..జై ఎన్టీఆర్’’ అన్నారు. నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. ఇది ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా. ఇది డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమాలా ఉండదు. ఈ సినిమాలో ప్రతి సీన్ కొత్తగా ఉండేలా దర్శకుడు శశాంక్ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. నిర్మాత అంటే ఇలాగే ఉండాలి అని శోబు గారిని చూసి నేర్చుకున్నా. షోయింగ్ బిజినెస్ అని నా బ్యానర్ పేరు పెట్టిందే కీరవాణి బాబాయ్. ఆయనకు స్పెషల్ థాంక్స్. ఫాహద్ ఫాజిల్ సినిమాలంటే నాకు పిచ్చి. ఆ పిచ్చిలోనే శాశాంక్ కథ విని ఫాహద్ ఫాజిల్ కి ఈ కథ చెప్పాలని అన్నా. ఆయన ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ. బాబా (రాజమౌళి) మీ పేరును ఇంకా పైకి తీసుకెళ్లాలని నా కోరిక. ఈ సినిమాను హైదరాబాద్ లోని 75 రియల్ లొకేషన్స్ లో షూట్ చేసాం. సినిమా యూనిట్ మొత్తం ఎంతో కష్టపడింది. తారక్ అన్నాను నోరువిప్పి అడగకుండానే మా సినిమా ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్’’ అని అన్నారు. దర్శకుడు శశాంక్ మాట్లాడుతూ.. ‘‘శోబు సార్, చిన్నా సార్, రాజమౌళి సార్ నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్, చిత్ర యూనిట్ మొత్తానికి పేరుపేరునా కృతజ్ఞతలు. కార్తికేయ మై పిల్లర్, ఈ సినిమాకు అన్నీ ఆయనే. తారక్ అన్న మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం మా యూనిట్ అందరి అదృష్టం’’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 2 న ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. టీం అంతా కలిసి ఎంతో కష్టపడి పని చేశారు. మా లిరికిస్ట్స్, సింగర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ప్రత్యేక అతిథి రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. కార్తికేయ చాలా కసితో తీసిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ వీళ్ళు అనుకున్నారు కదా మీరేనా బాహుబలి సినిమా చేసేది. మాకు రాజమౌళి అవసరం లేదు..శశాంక్ యేలేటితో తీసేస్తాం అని ఎంతో కసితో ఈ సినిమా చేశారు. ఇక సినిమా ఎందుకు హిట్ కాదు చెప్పండి. అక్టోబర్ 2 రిలీజ్ కదా, ఆ గాంధీ గారి ఆశిస్సులు మీపై ఉండాలి. ఇలాంటి వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా దర్శకుడు శశాంక్, వాళ్ళ గురువు చంద్రశేఖర్ ఏలేటిని మించిన వాడు కావాలని కోరుకుంటూ.. మా అబ్బాయి కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి పేరు రావాలని కోరుకుంటూ, నా అభిమాన నటుడు ఫాహద్ ఫాజిల్ కి మంచి హిట్ పడాలని కోరుకుంటూ, మా మరో అబ్బాయి కార్తికేయ మొదటి సారి సినిమా నిర్మాణంలోకి వచ్చారు. ఇన్ని కోరికలు నిజం కావాలంటే అది స్వార్థం కానీ, ఈ సినిమా ట్రైలర్ కి బాలయ్య గారి సాక్షిగా.. జై బాలయ్య, జై ఎన్టీఆర్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఇక ఈ సినిమా సక్సెస్ పక్కా. అందరూ సినిమా చూడండి’’ అన్నారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఎమోషనల్ అవుతున్నా. తారక్ తన తమ్ముడి ఫంక్షన్ కోసం వచ్చాడు. ఫాహద్ ఫాజిల్ ఒక్కో సినిమా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. ఆయన ఒక్కో క్యారెక్టర్ చూసి నిజంగా ఆశ్చర్యపోయా. ఫాఫా తెలుగు ప్రజల్లోకి ఎంతగానో వెళ్లిపోయారు. మూడేళ్ళ క్రిందట శశాంక్ కథ చెప్పాడని వచ్చాడు. ఒక దయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ అని ఒక్క లైన్ చెప్పాడు. ఆపై 3 గంటల కథ చెప్పాడు. వెంటనే నేను ఓకే చేశా. ఈ సినిమా చూసి నేను ఏడ్చాను. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా. కార్తికేయ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. అతను హై పొజీషన్ కి వెళ్తాడు అని నమ్ముతున్నా. ఇది నిజంగా గొప్ప సినిమా. అక్టోబర్ 2 న అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘గాయం నుంచి కోలుకున్నా. డ్రాగన్ చెప్పిన సమయానికే విడుదల అవుతుంది. కోవిడ్ అనే టఫ్ సమయంలో ఒక టాలెంట్ నెమ్మదిగా మనలోకి వచ్చింది. అదే ఫాహద్ సార్. మొదటిసారి బెంగళూరులో ఆయన సినిమా చూశా. నాకు అతి తక్కువ మంది యాక్టర్స్ ఇష్టం. అందులో మొదటి వ్యక్తి ఫాహద్ ఫాజిల్. దేశం గర్వించదగ్గ నటుడు ఫాహద్. ఆయన తెలుగులో మొదటిసారి లీడ్ యాక్టర్ గా చేస్తున్న ఫాహద్ గారికి మంచి విజయం దక్కుతుందని నమ్ముతున్నా. దర్శకుడిగా శశాంక్ మొదటి సినిమా ఈ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ సినిమా ఆయనకు గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నా. కార్తికేయ ఈ రోజు నిర్మాతగా ఇక్కడ నిలబడటం చాలా సంతోషంగా ఉంది. మా జక్కన్న చేసే ప్రతి ప్రయత్నంలో కార్తికేయ ఉన్నాడు. ట్రిపులార్, బాహుబలి సినిమాల వెనుక మా తమ్ముడు కార్తికేయనే ఉన్నాడు. కార్తికేయ కెరీర్ లో ఈ సినిమా గొప్ప చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
Open News →
Telugu Film Directors Association
30/9/2026, 1:12:00 pm
హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీ విష్ణు, జనకిరామ్ మారెళ్ల, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP 'కామ్రేడ్ కళ్యాణ్' రివల్యూషనరీ సాంగ్ ఎత్తర ఎత్తు ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి 'కామ్రేడ్ కళ్యాణ్' నుంచి ఎత్తర ఎత్తు సాంగ్ లాంచ్ చేశారు. విజయ్ బుల్గానిన్ రివల్యూషనరీ ఫ్లేవర్ ఉన్న పాటను కంపోజ్ చేశారు. నల్గొండ గద్దర్ నర్సన్న తన ప్రత్యేకమైన వాయిస్‌తో పవర్ఫుల్ ఎనర్జీని అందించగా, భాస్కరభట్ల రాసిన లిరిక్స్ పాటకు రివల్యూషనరీ ఫీల్‌ను తీసుకొచ్చాయి. శ్రీ విష్ణు పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, పాటలోని బీట్, లిరిక్స్ కలిసి ‘ఎత్తర ఎత్తు’ ఫుల్ ఎనర్జిటిక్ స్ఫూర్తి నింపే పాటగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నటీనటులు: శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే
Open News →

Telugu Film Directors Association
25/9/2026, 10:36:00 pm
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కాకా' డబ్బింగ్ ప్రారంభం బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కాకా’ డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయి. THE BLOODY BENCHMARK సెట్ చేసేందుకు చిత్ర బృందం ఫుల్ స్పీడ్‌లో వర్క్ చేస్తోంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు. ‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్ సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: బాబీ కొల్లి నిర్మాత: వెంకట్ కె నారాయణ బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్ సంగీతం: థమన్ ఎస్ స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి DOP: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్: ఆంటోనీ రూబెన్ ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా VFX సూపర్వైజర్: యుగంధర్ టి డైలాగ్స్: భాను-నందు ముఖ్య కో-డైరెక్టర్లు: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల PRO: వంశీ-శేఖర్ మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
Open News →

Telugu Film Directors Association
23/9/2026, 1:30:00 am
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులని అందుకున్న ‘కల్కి 2898 ఏడీ 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇండియన్ స్క్రీన్స్ పై బిగ్గెస్ట్ హిట్‌గా చరిత్ర సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు లభించాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు దక్కింది. అలాగే సినిమాకు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించిన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు లభించింది. చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీదత్, స్వప్నదత్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని అవార్డులు అందుకున్నారు. భారీ కాన్వాస్‌పై, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు దక్కడం వైజయంతీ మూవీస్‌కు మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తన యూనిక్ విజన్‌తో క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ ప్రపంచం, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, సాంకేతిక నైపుణ్యం, నటీనటుల ప్రతిభకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయి. దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో వైజయంతీ మూవీస్ తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మిస్తూ, కొత్త కథలను అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సంస్థ ఎప్పుడూ ముందుంటోంది. ఈ క్రమంలో ‘కల్కి 2898 ఏడీ’కి రెండు జాతీయ అవార్డులు రావడం సంస్థ ప్రయాణంలో మరో గర్వకారణమైన అధ్యాయంగా నిలిచింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికపై ‘కల్కి 2898 ఏడీ’ టీమ్ అవార్డులు అందుకున్న ఈ ప్రత్యేకమైన క్షణాలు సినీ అభిమానులకు కూడా మెమరబుల్ గా నిలిచాయి.
Open News →

Telugu Film Directors Association
20/9/2026, 12:10:00 pm
'ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది. ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. నాని గారి జడల్ క్యారెక్టర్లో మాస్, యాక్షన్ ఆడియన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. శ్రీకాంత్ గారు.. ఈ కథకు స్ఫూర్తి ఏమిటి? -ఈ కథకు నిజ జీవిత సంఘటన, కొన్ని పాత్రలు, అలాగే ఫిక్షన్.. ఈ మూడు ఉన్నాయి. -మా అమ్మగారు ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావించారు. కానీ పుట్టలేదు. నాకే జడలు వేసి, గౌన్ వేసి పెంచారు. నా రెండో క్లాస్ వరకు నాకు జడలు ఉండేవి. జడలు అక్కడి నుంచి తీసుకున్నాను. దీని వెనుక కూడా చాలా ఎమోషన్ ఉంటుంది. - ఇందులో ఉండే రెవల్యూషన్, ఆ పాత్రలను నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతం నుంచి స్ఫూర్తి పొందినవి. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్యలో జరిగిన సంఘటనలు తీసుకున్నాను. నేను సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నాను. ఆ పక్కన ఉండే బస్తీలో జరిగే కథలాగా డిజైన్ చేశాను. మా ఊర్లో నేను చూసిన సంఘటనలన్నీ మళ్లీ ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యాయి. ఇందులో నానిని ఎలా చూపించాలని అనుకున్నారు? దసరాలో మిస్ అయిన నాని ఇందులో చూపిస్తారని విన్నాం ? -‘దసరా’ని ఒక మంచి డ్రామాగా చేయాలనేది నా ఉద్దేశం. కాకపోతే ప్రమోషనల్ కంటెంట్ చూసి అదొక ‘కేజీఎఫ్’లా చాలా మాస్‌గా ఉంటుందని అనుకున్నారు. థియేటర్లోకి వెళ్లి చూసిన తర్వాత ప్యూర్ డ్రామా ఉంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యారని నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కాకపోతే రెండు రోజుల తర్వాత దానికి ట్యూన్ అయిపోయారు. సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. రికార్డ్స్ వచ్చాయి. -కాకపోతే అప్పుడు ఆడియన్స్ కోరుకునేది తీస్తే అది కమర్షియల్‌గా హై ఫీల్ అవుతారు కదా అని అనిపించి, అలా నాని గారి దగ్గరికి వెళ్లి ఈ ఆలోచన చెప్పాను. ఆడియన్స్ కోరుకునేది ఇవ్వాలని ఉద్దేశంతో ఇప్పుడు ‘ప్యారడైజ్’ తీసుకొస్తున్నాం. -‘ప్యారడైజ్’లో యాక్షన్, ఎమోషన్స్, మదర్ అండ్ సన్ ఎమోషన్ అన్నీ కూడా బ్లెండ్ అయి ఉంటాయి. అయితే నాకు అడిగితే యాక్షన్ కంటే ఎమోషన్ డామినేట్ చేస్తుందని భావిస్తున్నాను. ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్‌కు చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు. ట్రైలర్ ఇవ్వకపోవడం వెనుక కారణం? -ముందే చెప్పినట్టు ఆ ట్రైలర్ కట్ చేయడానికి చాలా సమయం కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత సమయం ట్రైలర్ కి కేటాయించలెం. నేను ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నాను. కానీ నాకు పర్సనల్‌గా అడిగితే.. మనం చిన్నప్పుడు ఏమీ చూడకుండానే థియేటర్లోకి వెళ్లి ప్రతి మూమెంట్‌కు సర్ప్రైజ్ అయ్యేవాళ్లం. నాకు పర్సనల్‌గా అలా నేరుగా థియేటర్‌కి వెళ్లి సర్ప్రైజ్ అవ్వడమే ఇష్టం. నా నెక్స్ట్ సినిమాకి సాధ్యమైనంత తక్కువ అప్డేట్స్తోనే సినిమాని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను. చివరి 40 రోజులుగా మీరు, మీ టీం అసలు ఇంటికి కూడా వెళ్లలేదని విన్నాము? నేను ఏదైనా మనస్ఫూర్తిగా, నేను అనుకున్నది వచ్చేంతవరకు చేస్తాను. ఈ విషయంలో మా టీంను ఇబ్బంది పెట్టాను. (నవ్వుతూ) నేను అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లు అయినా తీస్తాను. కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత మళ్లీ రీషూట్ జోలికి వెళ్లను. షూటింగ్లో జాప్యం జరగడానికి కారణం? -నేను అనుకున్న విధంగా షూట్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. దాని కారణంగా డేస్ పెరిగాయి. ఒకరోజు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్‌లో ఫినిష్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆ టార్గెట్ ఫినిష్ చేయలేకపోయాను. దానివల్ల మళ్లీ అందరి డేట్స్ అడ్జస్ట్ చేసి చేయాల్సి వచ్చింది. అంతేగానీ కంటెంట్, రీషూట్ అనేది సమస్య కాదు. ఈ సినిమా కోసం ఎక్కడా రీషూట్లు చేయలేదు. అలాగే మొదట ఏదైతే బౌండ్ స్క్రిప్ట్ అనుకున్నానో దాని ప్రకారమే చేశాను. నాని గారితో మీకు చాలా అనుబంధం ఉంది కదా? -నాని గారు, నేను అన్నదమ్ముల్లాగే మాట్లాడుకుంటాం. నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయనతో నేను ప్రతిదీ చెప్తాను. మోహన్ బాబు పాత్ర గురించి? -ఈ కథకి ఆయన పాత్ర చాలా కీలకం. మోహన్ బాబు గారు, నాని గారి క్యారెక్టర్స్ పేస్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సంపూర్ణేష్ పాత్ర గురించి? -సంపూ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. సంపూర్ణేష్ బాబు పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. అనిరుధ్ మ్యూజిక్ గురించి? -అనిరుధ్‌తో పని చేయడం చాలా హాయిగా ఉంటుంది. నేను ఏం చెప్పాలనుకున్నానో క్లియర్‌గా అర్థం అవుతుంది. మనకున్న మెంటల్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటే దాని కిక్కు వేరుగా ఉంటుంది. (నవ్వుతూ) ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో అలా చేశాం. ఇందులో బిట్స్ సాంగ్స్ కలుపుకొని మొత్తం ఆరు పాటలు ఉంటాయి. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా? -ఈ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ ఏమీ లేదు. ఇది సింగిల్ మూవీ. ‘ఏష నాగుల’ పాట గురించి? నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆటోలో ప్రతిరోజూ ఆ పాట పెట్టేవారు. అనిరుధ్‌కి ఐడియా చెబితే చాలా అద్భుతంగా చేశాడు. నిజానికి ‘దసరా’లోనే ఆ పాట పెట్టాలని అనుకున్నాను. ఇందులో కుదిరింది. నాకు జానపద గీతాలు అంటే చాలా ఇష్టం. ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు? -170 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొదట ప్లానింగ్ ప్రకారం 160 రోజుల్లో అయిపోతుంది అనుకున్నాను. కానీ సినిమా వెళ్తున్న ఫ్లోలో ఒక పది రోజులు పెరిగింది. అసలు మీకు సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది? -నేను తొమ్మిదో క్లాసులో ఉండగా ‘జగడం’ సినిమా వచ్చింది. ఆ సినిమాని థియేటర్లో చూసి నేను కూడా సినిమా తీయాలని బలంగా ఫిక్స్ అయిపోయాను. ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. నేరుగా సుకుమార్ గారిని కలవడానికి వెళ్లాను. పొద్దున లేచి ఆయన గేటు దగ్గర నిలబడటమే నాకు పని. అలా నాలుగేళ్లు అయిన తర్వాత ఆయన ఒక షార్ట్ ఫిలిం చేసి తీసుకురమ్మన్నారు. అది చూసి జాయిన్ చేసుకున్నారు. ఆయన దగ్గర ‘రంగస్థలం’ సినిమాకి పని చేశాను. -కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, శేఖర్ కమ్ముల గారు, పూరి గారు.. వీళ్ల ప్రభావం నా మీద బలంగా ఉంటుంది. చిరంజీవి గారితో సినిమా గురించి? -‘ప్యారడైజ్’ రిలీజ్ అయిన తర్వాత ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. బ్రెయిన్‌కి రెస్ట్ కావాలి. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో కూడా చెప్పాను.(నవ్వుతూ) కాస్త ఫ్యామిలీ సమయం గడపాలని అనుకుంటున్నాను. చిరంజీవి గారితో సినిమా 100% ఉంటుంది.
Open News →
Telugu Film Directors Association
20/9/2026, 12:08:00 pm
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ టీజర్ రిలీజ్ లాంచ్ చేశారు. మూగ కుర్రాడైన అనీష్.. తన ప్రేమించిన కీర్తి(అనస్వర) తో మాట్లాడాలని, ఆమెను దగ్గరగా చూడాలని కోరుకుంటాడు. అతడిని పోలీసులు, గూండాలు వెతుకుతుండటంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ పాత్రలో అనీష్ ఆకట్టుకున్నాడు. హ్యూమర్, ఎమోషన్, యాక్షన్‌తో పాత్రను ఎనర్జిటిక్‌గా ప్రజెంట్ చేశాడు. అనస్వర రాజన్ చార్మింగ్‌గా కనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. దర్శకుడు మహేష్ ఉప్పల హ్యూమర్, ఎమోషన్, థ్రిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ టీజర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. రాజా మహాదేవ్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. థమన్ మ్యూజిక్ టీజర్ ని మరింత ఎలివేట్ చేసింది. వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. టీజర్ సినిమాపై అంచనాలని మరింత పెంచింది. టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో అనీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ వెంకీ అన్న. ఈ క్యారెక్టర్ చేయగలను అని నమ్మింది ఆయనే. ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా ఆయనే. ఈ కథని మహేష్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అర్జున్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయిపోయాను. ఈ సినిమా మీకు గుర్తుండిపోతుంది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మహేష్‌కి థాంక్యూ. ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. యాక్షన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. అనస్వర కీర్తి క్యారెక్టర్ని అద్భుతంగా చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత కీర్తి పాత్రలో తనని చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. మన నటీనటులందరికీ థాంక్యూ. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్ అన్నకి థాంక్యూ. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మేమందరం కొత్త వాళ్లం. అక్టోబర్ 30న థియేటర్‌కి వస్తున్నాం. అర్జున్ మాటలు మీకు వినిపించకపోవచ్చు.. కానీ తన ప్రేమ గట్టిగా కనిపిస్తుంది. అందరికీ థాంక్యూ సో మచ్. నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా నాతో సినిమాలు నిర్మించిన ఉషా ముల్పురి, చిన్నబాబు గారు, నాగవంశీ గారు, మైత్రీ రవి గారు, నవీన్ గారికి థాంక్యూ సో మచ్. నేను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ల కష్టం చూశాను. నేను ప్రొడ్యూసర్ అయ్యాక అది పర్సనల్‌గా ఫీల్ అయ్యాను. ఇంతకుముందు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు సీన్ గురించి మాత్రమే ఆలోచించే వాడిని. ఇప్పుడు సీన్ గురించి, బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఒక డైరెక్టర్ ఇలా ప్రొడ్యూసర్ అవడం వల్ల మిగతా క్రాఫ్ట్స్ మీద కూడా నాకు చాలా మంచి అవగాహన వచ్చిందని నమ్ముతున్నాను. ప్రొడ్యూసర్స్ వల్లే తెలుగు సినిమాకి కొత్త డైరెక్టర్లు, హీరోలు వస్తున్నారు. వారికి హ్యాట్సప్. ఇందులో అనీష్ పర్ఫార్మెన్స్ చూశాను. తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపించింది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీల్ అవుతారు. నేను నా తొలి సినిమాకి కన్నడలో ‘కిరాక్ పార్టీ’ సినిమా చూసి రష్మికను తీసుకున్నాను. తను ఎంతో పెద్ద నటిగా ఎదిగింది. ఎన్నో అచీవ్మెంట్స్ చేసింది. ఈ సినిమాలో అనీష్ని తీసుకున్నాను. తనని నేను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే మహేష్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీస్ చేశాడు. తన ప్యాషన్ నాకు చాలా నచ్చింది. తను చాలా టాలెంటెడ్. తన టాలెంట్‌ని నమ్మాను. తను చెప్పిన కథను స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలాగే రాజాను డీఓపీగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు. నాగార్జున గారి 100వ సినిమాకి ఈయనే డీఓపీగా పనిచేస్తున్నారు. ప్రతి డైరెక్టర్ ఒక సినిమాని నిర్మిస్తే అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. నిర్మాతగా నేను, దర్శకుడు, హీరో.. అందరం కొత్త వాళ్లం. మీరందరూ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కొత్త టాలెంట్ మరెంతమంది వస్తారో.. చాలా మంచి సినిమాలు వస్తాయి. అక్టోబర్ 30న తప్పకుండా అందరూ సినిమాని థియేటర్లో చూస్తారని కోరుకుంటున్నాను.” అనస్వర రాజన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘ఇట్లు అర్జున’ నేను తెలుగులో సైన్ చేసిన ఫస్ట్ ఫిలిం. ఇది నాకు చాలా స్పెషల్. మీ అందరి సపోర్ట్‌తో నేను ఇంకా ఎన్నో సినిమాలు ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను. మా టీం గురించి చాలా చెప్పాలి. కీర్తి క్యారెక్టర్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో ఉండే తన ఇన్నోసెంట్ హ్యాపీనెస్‌ని చాలా ఎంజాయ్ చేశాను. తప్పకుండా కీర్తి మీ అందరికీ చాలా నచ్చుతుంది. అలాగే అనీష్ ఇంకా నచ్చుతాడు. అక్టోబర్ 30న మీరందరూ థియేటర్లో ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థియేటర్స్‌లో కలుద్దాం.” దరాకుడు మహేష్ ఉప్పల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కథని నమ్మిన వెంకీ గారికి థాంక్యూ. ఆయన నన్ను నమ్మారు. నేను సినిమా బాగా తీయగలను అనే నమ్మకాన్ని అనీష్ ఇచ్చాడు. అనీష్ ఎంత కష్టపడ్డాడో మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. తను ఒక కొత్త కుర్రాడు. కానీ చాలా ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ క్యారెక్టర్ చేశాడు. తన కష్టం నచ్చితే మీరు తనని ఎంకరేజ్ చేయండి. తను చాలా మంచి సినిమాలు చేస్తాడు. అనస్వర అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అందరూ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా కంటెంట్ నచ్చితే అందరూ సపోర్ట్ చేయండి. తమన్ గారు ఈ సినిమాని ఎంత ప్రేమించి చేశారో అక్టోబర్ 30వ తేదీన మీకు అర్థమవుతుంది. వినిపిస్తుంది. తమన్ గారికి థాంక్యూ. మానసతో కలిసి ఈ కథను చాలా ఇష్టపడి రాశాను. అందరూ ఇష్టపడి తీశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. మానస శర్మ మాట్లాడుతూ.. ఈ టీం నాకు చాలా స్పెషల్. అనీష్ మూగ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. అది అంత ఈజీ కాదు. దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాడు. ఈ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ ఇష్టపడతారు. అలాగే అనస్వర పాత్ర కూడా అద్భుతంగా ఉంది. మీరందరూ తన ప్రేమలో పడిపోతారు. ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది. తప్పకుండా మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
Open News →10 photos
Loading X post…
View post on X ↗