
30/8/2026, 7:48:00 pm
థాట్ టు థియేటర్ - స్క్రీంప్లే రైటింగ్ వర్క్‌షాప్ - శ్రీ కోన వెంకట్ గారు, రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్
TFDA ఆధ్వర్యంలో మన సభ్యుల కోసం 23 ఆగస్ట్ 2026 న ఫిల్మ్ ఛాంబర్ లో ఉదయం 10 నుండి సాయంత్రం 7 వరకు ‘థాట్ టు థియేటర్ - స్క్రీంప్లే రైటింగ్’ పైన వర్క్ షాప్ శ్రీ కోన వెంకట్ గారు, రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారి ద్ర్వార నిర్వహించబడినది.
TFDA అధ్యక్షులు శ్రీ VN ఆదిత్య గారు, జనరల్ సెక్రటరీ శ్రీ రామారావు గారు, మిగతా కమిటీ సభ్యులతో పాటుగా ప్రముఖ రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు తదితరులు ఈ వర్క్‌షాప్ లో పాల్గొన్నారు. ఉదయం 10 కి ప్రారంభమైన ఈ వర్క్ షాప్ లో అందరూ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని లంచ్ అనంతరం జరిగిన Q&A session లో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొని తమకు కలిగేలా సందేహాలను నివృత్తి చేసుకున్నారు .
అనంతరం ప్రముఖ రచయిత నటులు దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారు తాను నిర్దేశకత్వం వహించిన సూపర్ సక్సెస్ వహించిన ‘మిథునం’ సినిమా పై రాసిన పుస్తకాన్ని మనసభ్యులకు పంపిణీ చేసారు. ఈ పుస్తకాలకు అయినా ఖర్చుతోపాటు, ఈ వర్క్ షాప్ కి భోజనాలకు అయిన మొత్తం ఖర్చును TFDA అధ్యక్షులు శ్రీ VN ఆదిత్య గారు తన సొంతంగా వితరణ చేసారు…. సభ్యుల అభివృద్ధికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు తన సొంత టీమ్ కోసం చేసినట్లుగా భావించి చేస్తున్న అధ్యక్షులు ఉండటం ఎంతో గర్వకారణం…. మున్ముందు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను TFDA చేపట్టాలని హాజరైన సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు…
