హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీ విష్ణు, జనకిరామ్ మారెళ్ల, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP 'కామ్రేడ్ కళ్యాణ్' రివల్యూషనరీ సాంగ్ ఎత్తర ఎత్తు ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి 'కామ్రేడ్ కళ్యాణ్' నుంచి ఎత్తర ఎత్తు సాంగ్ లాంచ్ చేశారు. విజయ్ బుల్గానిన్ రివల్యూషనరీ ఫ్లేవర్ ఉన్న పాటను కంపోజ్ చేశారు. నల్గొండ గద్దర్ నర్సన్న తన ప్రత్యేకమైన వాయిస్‌తో పవర్ఫుల్ ఎనర్జీని అందించగా, భాస్కరభట్ల రాసిన లిరిక్స్ పాటకు రివల్యూషనరీ ఫీల్‌ను తీసుకొచ్చాయి. శ్రీ విష్ణు పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, పాటలోని బీట్, లిరిక్స్ కలిసి ‘ఎత్తర ఎత్తు’ ఫుల్ ఎనర్జిటిక్ స్ఫూర్తి నింపే పాటగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నటీనటులు: శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కాకా' డబ్బింగ్ ప్రారంభం బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కాకా’ డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయి. THE BLOODY BENCHMARK సెట్ చేసేందుకు చిత్ర బృందం ఫుల్ స్పీడ్‌లో వర్క్ చేస్తోంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు. ‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్ సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: బాబీ కొల్లి నిర్మాత: వెంకట్ కె నారాయణ బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్ సంగీతం: థమన్ ఎస్ స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి DOP: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్: ఆంటోనీ రూబెన్ ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా VFX సూపర్వైజర్: యుగంధర్ టి డైలాగ్స్: భాను-నందు ముఖ్య కో-డైరెక్టర్లు: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల PRO: వంశీ-శేఖర్ మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులని అందుకున్న ‘కల్కి 2898 ఏడీ 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇండియన్ స్క్రీన్స్ పై బిగ్గెస్ట్ హిట్‌గా చరిత్ర సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు లభించాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు దక్కింది. అలాగే సినిమాకు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించిన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు లభించింది. చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీదత్, స్వప్నదత్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని అవార్డులు అందుకున్నారు. భారీ కాన్వాస్‌పై, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు దక్కడం వైజయంతీ మూవీస్‌కు మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తన యూనిక్ విజన్‌తో క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ ప్రపంచం, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, సాంకేతిక నైపుణ్యం, నటీనటుల ప్రతిభకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయి. దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో వైజయంతీ మూవీస్ తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మిస్తూ, కొత్త కథలను అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సంస్థ ఎప్పుడూ ముందుంటోంది. ఈ క్రమంలో ‘కల్కి 2898 ఏడీ’కి రెండు జాతీయ అవార్డులు రావడం సంస్థ ప్రయాణంలో మరో గర్వకారణమైన అధ్యాయంగా నిలిచింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికపై ‘కల్కి 2898 ఏడీ’ టీమ్ అవార్డులు అందుకున్న ఈ ప్రత్యేకమైన క్షణాలు సినీ అభిమానులకు కూడా మెమరబుల్ గా నిలిచాయి.
'ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది. ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. నాని గారి జడల్ క్యారెక్టర్లో మాస్, యాక్షన్ ఆడియన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. శ్రీకాంత్ గారు.. ఈ కథకు స్ఫూర్తి ఏమిటి? -ఈ కథకు నిజ జీవిత సంఘటన, కొన్ని పాత్రలు, అలాగే ఫిక్షన్.. ఈ మూడు ఉన్నాయి. -మా అమ్మగారు ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావించారు. కానీ పుట్టలేదు. నాకే జడలు వేసి, గౌన్ వేసి పెంచారు. నా రెండో క్లాస్ వరకు నాకు జడలు ఉండేవి. జడలు అక్కడి నుంచి తీసుకున్నాను. దీని వెనుక కూడా చాలా ఎమోషన్ ఉంటుంది. - ఇందులో ఉండే రెవల్యూషన్, ఆ పాత్రలను నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతం నుంచి స్ఫూర్తి పొందినవి. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్యలో జరిగిన సంఘటనలు తీసుకున్నాను. నేను సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నాను. ఆ పక్కన ఉండే బస్తీలో జరిగే కథలాగా డిజైన్ చేశాను. మా ఊర్లో నేను చూసిన సంఘటనలన్నీ మళ్లీ ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యాయి. ఇందులో నానిని ఎలా చూపించాలని అనుకున్నారు? దసరాలో మిస్ అయిన నాని ఇందులో చూపిస్తారని విన్నాం ? -‘దసరా’ని ఒక మంచి డ్రామాగా చేయాలనేది నా ఉద్దేశం. కాకపోతే ప్రమోషనల్ కంటెంట్ చూసి అదొక ‘కేజీఎఫ్’లా చాలా మాస్‌గా ఉంటుందని అనుకున్నారు. థియేటర్లోకి వెళ్లి చూసిన తర్వాత ప్యూర్ డ్రామా ఉంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యారని నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కాకపోతే రెండు రోజుల తర్వాత దానికి ట్యూన్ అయిపోయారు. సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. రికార్డ్స్ వచ్చాయి. -కాకపోతే అప్పుడు ఆడియన్స్ కోరుకునేది తీస్తే అది కమర్షియల్‌గా హై ఫీల్ అవుతారు కదా అని అనిపించి, అలా నాని గారి దగ్గరికి వెళ్లి ఈ ఆలోచన చెప్పాను. ఆడియన్స్ కోరుకునేది ఇవ్వాలని ఉద్దేశంతో ఇప్పుడు ‘ప్యారడైజ్’ తీసుకొస్తున్నాం. -‘ప్యారడైజ్’లో యాక్షన్, ఎమోషన్స్, మదర్ అండ్ సన్ ఎమోషన్ అన్నీ కూడా బ్లెండ్ అయి ఉంటాయి. అయితే నాకు అడిగితే యాక్షన్ కంటే ఎమోషన్ డామినేట్ చేస్తుందని భావిస్తున్నాను. ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్‌కు చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు. ట్రైలర్ ఇవ్వకపోవడం వెనుక కారణం? -ముందే చెప్పినట్టు ఆ ట్రైలర్ కట్ చేయడానికి చాలా సమయం కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత సమయం ట్రైలర్ కి కేటాయించలెం. నేను ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నాను. కానీ నాకు పర్సనల్‌గా అడిగితే.. మనం చిన్నప్పుడు ఏమీ చూడకుండానే థియేటర్లోకి వెళ్లి ప్రతి మూమెంట్‌కు సర్ప్రైజ్ అయ్యేవాళ్లం. నాకు పర్సనల్‌గా అలా నేరుగా థియేటర్‌కి వెళ్లి సర్ప్రైజ్ అవ్వడమే ఇష్టం. నా నెక్స్ట్ సినిమాకి సాధ్యమైనంత తక్కువ అప్డేట్స్తోనే సినిమాని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను. చివరి 40 రోజులుగా మీరు, మీ టీం అసలు ఇంటికి కూడా వెళ్లలేదని విన్నాము? నేను ఏదైనా మనస్ఫూర్తిగా, నేను అనుకున్నది వచ్చేంతవరకు చేస్తాను. ఈ విషయంలో మా టీంను ఇబ్బంది పెట్టాను. (నవ్వుతూ) నేను అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లు అయినా తీస్తాను. కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత మళ్లీ రీషూట్ జోలికి వెళ్లను. షూటింగ్లో జాప్యం జరగడానికి కారణం? -నేను అనుకున్న విధంగా షూట్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. దాని కారణంగా డేస్ పెరిగాయి. ఒకరోజు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్‌లో ఫినిష్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆ టార్గెట్ ఫినిష్ చేయలేకపోయాను. దానివల్ల మళ్లీ అందరి డేట్స్ అడ్జస్ట్ చేసి చేయాల్సి వచ్చింది. అంతేగానీ కంటెంట్, రీషూట్ అనేది సమస్య కాదు. ఈ సినిమా కోసం ఎక్కడా రీషూట్లు చేయలేదు. అలాగే మొదట ఏదైతే బౌండ్ స్క్రిప్ట్ అనుకున్నానో దాని ప్రకారమే చేశాను. నాని గారితో మీకు చాలా అనుబంధం ఉంది కదా? -నాని గారు, నేను అన్నదమ్ముల్లాగే మాట్లాడుకుంటాం. నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయనతో నేను ప్రతిదీ చెప్తాను. మోహన్ బాబు పాత్ర గురించి? -ఈ కథకి ఆయన పాత్ర చాలా కీలకం. మోహన్ బాబు గారు, నాని గారి క్యారెక్టర్స్ పేస్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సంపూర్ణేష్ పాత్ర గురించి? -సంపూ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. సంపూర్ణేష్ బాబు పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. అనిరుధ్ మ్యూజిక్ గురించి? -అనిరుధ్‌తో పని చేయడం చాలా హాయిగా ఉంటుంది. నేను ఏం చెప్పాలనుకున్నానో క్లియర్‌గా అర్థం అవుతుంది. మనకున్న మెంటల్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటే దాని కిక్కు వేరుగా ఉంటుంది. (నవ్వుతూ) ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో అలా చేశాం. ఇందులో బిట్స్ సాంగ్స్ కలుపుకొని మొత్తం ఆరు పాటలు ఉంటాయి. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా? -ఈ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ ఏమీ లేదు. ఇది సింగిల్ మూవీ. ‘ఏష నాగుల’ పాట గురించి? నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆటోలో ప్రతిరోజూ ఆ పాట పెట్టేవారు. అనిరుధ్‌కి ఐడియా చెబితే చాలా అద్భుతంగా చేశాడు. నిజానికి ‘దసరా’లోనే ఆ పాట పెట్టాలని అనుకున్నాను. ఇందులో కుదిరింది. నాకు జానపద గీతాలు అంటే చాలా ఇష్టం. ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు? -170 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొదట ప్లానింగ్ ప్రకారం 160 రోజుల్లో అయిపోతుంది అనుకున్నాను. కానీ సినిమా వెళ్తున్న ఫ్లోలో ఒక పది రోజులు పెరిగింది. అసలు మీకు సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది? -నేను తొమ్మిదో క్లాసులో ఉండగా ‘జగడం’ సినిమా వచ్చింది. ఆ సినిమాని థియేటర్లో చూసి నేను కూడా సినిమా తీయాలని బలంగా ఫిక్స్ అయిపోయాను. ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. నేరుగా సుకుమార్ గారిని కలవడానికి వెళ్లాను. పొద్దున లేచి ఆయన గేటు దగ్గర నిలబడటమే నాకు పని. అలా నాలుగేళ్లు అయిన తర్వాత ఆయన ఒక షార్ట్ ఫిలిం చేసి తీసుకురమ్మన్నారు. అది చూసి జాయిన్ చేసుకున్నారు. ఆయన దగ్గర ‘రంగస్థలం’ సినిమాకి పని చేశాను. -కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, శేఖర్ కమ్ముల గారు, పూరి గారు.. వీళ్ల ప్రభావం నా మీద బలంగా ఉంటుంది. చిరంజీవి గారితో సినిమా గురించి? -‘ప్యారడైజ్’ రిలీజ్ అయిన తర్వాత ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. బ్రెయిన్‌కి రెస్ట్ కావాలి. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో కూడా చెప్పాను.(నవ్వుతూ) కాస్త ఫ్యామిలీ సమయం గడపాలని అనుకుంటున్నాను. చిరంజీవి గారితో సినిమా 100% ఉంటుంది.
20/9/2026, 12:08:00 pm
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ టీజర్ రిలీజ్ లాంచ్ చేశారు. మూగ కుర్రాడైన అనీష్.. తన ప్రేమించిన కీర్తి(అనస్వర) తో మాట్లాడాలని, ఆమెను దగ్గరగా చూడాలని కోరుకుంటాడు. అతడిని పోలీసులు, గూండాలు వెతుకుతుండటంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ పాత్రలో అనీష్ ఆకట్టుకున్నాడు. హ్యూమర్, ఎమోషన్, యాక్షన్‌తో పాత్రను ఎనర్జిటిక్‌గా ప్రజెంట్ చేశాడు. అనస్వర రాజన్ చార్మింగ్‌గా కనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. దర్శకుడు మహేష్ ఉప్పల హ్యూమర్, ఎమోషన్, థ్రిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ టీజర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. రాజా మహాదేవ్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. థమన్ మ్యూజిక్ టీజర్ ని మరింత ఎలివేట్ చేసింది. వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. టీజర్ సినిమాపై అంచనాలని మరింత పెంచింది. టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో అనీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ వెంకీ అన్న. ఈ క్యారెక్టర్ చేయగలను అని నమ్మింది ఆయనే. ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా ఆయనే. ఈ కథని మహేష్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అర్జున్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయిపోయాను. ఈ సినిమా మీకు గుర్తుండిపోతుంది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మహేష్‌కి థాంక్యూ. ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. యాక్షన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. అనస్వర కీర్తి క్యారెక్టర్ని అద్భుతంగా చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత కీర్తి పాత్రలో తనని చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. మన నటీనటులందరికీ థాంక్యూ. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్ అన్నకి థాంక్యూ. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మేమందరం కొత్త వాళ్లం. అక్టోబర్ 30న థియేటర్‌కి వస్తున్నాం. అర్జున్ మాటలు మీకు వినిపించకపోవచ్చు.. కానీ తన ప్రేమ గట్టిగా కనిపిస్తుంది. అందరికీ థాంక్యూ సో మచ్. నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా నాతో సినిమాలు నిర్మించిన ఉషా ముల్పురి, చిన్నబాబు గారు, నాగవంశీ గారు, మైత్రీ రవి గారు, నవీన్ గారికి థాంక్యూ సో మచ్. నేను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ల కష్టం చూశాను. నేను ప్రొడ్యూసర్ అయ్యాక అది పర్సనల్‌గా ఫీల్ అయ్యాను. ఇంతకుముందు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు సీన్ గురించి మాత్రమే ఆలోచించే వాడిని. ఇప్పుడు సీన్ గురించి, బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఒక డైరెక్టర్ ఇలా ప్రొడ్యూసర్ అవడం వల్ల మిగతా క్రాఫ్ట్స్ మీద కూడా నాకు చాలా మంచి అవగాహన వచ్చిందని నమ్ముతున్నాను. ప్రొడ్యూసర్స్ వల్లే తెలుగు సినిమాకి కొత్త డైరెక్టర్లు, హీరోలు వస్తున్నారు. వారికి హ్యాట్సప్. ఇందులో అనీష్ పర్ఫార్మెన్స్ చూశాను. తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపించింది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీల్ అవుతారు. నేను నా తొలి సినిమాకి కన్నడలో ‘కిరాక్ పార్టీ’ సినిమా చూసి రష్మికను తీసుకున్నాను. తను ఎంతో పెద్ద నటిగా ఎదిగింది. ఎన్నో అచీవ్మెంట్స్ చేసింది. ఈ సినిమాలో అనీష్ని తీసుకున్నాను. తనని నేను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే మహేష్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీస్ చేశాడు. తన ప్యాషన్ నాకు చాలా నచ్చింది. తను చాలా టాలెంటెడ్. తన టాలెంట్‌ని నమ్మాను. తను చెప్పిన కథను స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలాగే రాజాను డీఓపీగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు. నాగార్జున గారి 100వ సినిమాకి ఈయనే డీఓపీగా పనిచేస్తున్నారు. ప్రతి డైరెక్టర్ ఒక సినిమాని నిర్మిస్తే అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. నిర్మాతగా నేను, దర్శకుడు, హీరో.. అందరం కొత్త వాళ్లం. మీరందరూ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కొత్త టాలెంట్ మరెంతమంది వస్తారో.. చాలా మంచి సినిమాలు వస్తాయి. అక్టోబర్ 30న తప్పకుండా అందరూ సినిమాని థియేటర్లో చూస్తారని కోరుకుంటున్నాను.” అనస్వర రాజన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘ఇట్లు అర్జున’ నేను తెలుగులో సైన్ చేసిన ఫస్ట్ ఫిలిం. ఇది నాకు చాలా స్పెషల్. మీ అందరి సపోర్ట్‌తో నేను ఇంకా ఎన్నో సినిమాలు ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను. మా టీం గురించి చాలా చెప్పాలి. కీర్తి క్యారెక్టర్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో ఉండే తన ఇన్నోసెంట్ హ్యాపీనెస్‌ని చాలా ఎంజాయ్ చేశాను. తప్పకుండా కీర్తి మీ అందరికీ చాలా నచ్చుతుంది. అలాగే అనీష్ ఇంకా నచ్చుతాడు. అక్టోబర్ 30న మీరందరూ థియేటర్లో ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థియేటర్స్‌లో కలుద్దాం.” దరాకుడు మహేష్ ఉప్పల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కథని నమ్మిన వెంకీ గారికి థాంక్యూ. ఆయన నన్ను నమ్మారు. నేను సినిమా బాగా తీయగలను అనే నమ్మకాన్ని అనీష్ ఇచ్చాడు. అనీష్ ఎంత కష్టపడ్డాడో మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. తను ఒక కొత్త కుర్రాడు. కానీ చాలా ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ క్యారెక్టర్ చేశాడు. తన కష్టం నచ్చితే మీరు తనని ఎంకరేజ్ చేయండి. తను చాలా మంచి సినిమాలు చేస్తాడు. అనస్వర అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అందరూ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా కంటెంట్ నచ్చితే అందరూ సపోర్ట్ చేయండి. తమన్ గారు ఈ సినిమాని ఎంత ప్రేమించి చేశారో అక్టోబర్ 30వ తేదీన మీకు అర్థమవుతుంది. వినిపిస్తుంది. తమన్ గారికి థాంక్యూ. మానసతో కలిసి ఈ కథను చాలా ఇష్టపడి రాశాను. అందరూ ఇష్టపడి తీశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. మానస శర్మ మాట్లాడుతూ.. ఈ టీం నాకు చాలా స్పెషల్. అనీష్ మూగ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. అది అంత ఈజీ కాదు. దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాడు. ఈ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ ఇష్టపడతారు. అలాగే అనస్వర పాత్ర కూడా అద్భుతంగా ఉంది. మీరందరూ తన ప్రేమలో పడిపోతారు. ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది. తప్పకుండా మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
20/9/2026, 12:05:00 pm
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లాంచ్ చేసిన సందీప్ కిషన్, జేసన్ సంజయ్, లైకా ప్రొడక్షన్స్ ‘సిగ్మా’ హీస్ట్ అడ్వెంచర్ ట్రైలర్ సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్, హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాకు సంబంధించిన డిఫరెంట్ వరల్డ్‌ను, యాక్షన్ టచ్‌ను పరిచయం చేశాయి. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మోసపోయిన హీరో, జరిగిన దాన్ని మర్చిపోయి ముందుకు వెళ్లకుండా.. తనకు జరిగిన నష్టాన్ని తిరిగి సాధించుకోవాలని పోరాటం మొదలుపెడతాడు. డ్రగ్స్, గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన రూ.500 కోట్ల భారీ రాకెట్ ఈ కథలో కీలకంగా ఉంటుంది. దీంతో హీరో క్రైమ్, మోసం, ప్రమాదాలతో కూడిన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. మరోవైపు ఓ ఆర్జేతో ప్రేమలో ఉన్న హీరో.. తన స్నేహితుల సహాయంతో భారీ హీస్ట్‌కు ప్లాన్ చేస్తాడు. అయితే ఎంతో పక్కాగా వేసుకున్న ఆ ప్లాన్‌కు రెడ్డి అడ్డుపడటంతో మొత్తం ఆపరేషన్ గందరగోళంగా మారుతుంది. ఓటమిని అంగీకరించని హీరో మరింత బలంగా తిరిగి వచ్చి.. అన్ని అడ్డంకులను అధిగమించి తన లక్ష్యాన్ని ఎలా సాధించాడనేది ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరమైన హీస్ట్ కథను ఎంచుకున్న జేసన్ సంజయ్.. యాక్షన్, అడ్వెంచర్, ఫన్, ఎమోషన్‌ను ఎంగేజింగ్‌గా మిక్స్ చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా తల్లి-కొడుకు ఎమోషన్ సినిమాకు మంచి డెప్త్‌ను తీసుకొచ్చేలా కనిపిస్తోంది. థ్రిల్లింగ్ నెరేషన్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ఈ ఎమోషన్ మరింత బలం చేకూరుస్తోంది. సందీప్ కిషన్ తనదైన స్వాగ్తో క్యారెక్టర్లో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఆయనకు జోడీగా ఫారియా అబ్దుల్లా కీలక పాత్రలో కనిపించారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంది. రాజు సుందరం తన కామెడీతో ఫ్రెష్‌నెస్ తీసుకురాగా.. సంపత్ రాజ్ రెడ్డి పాత్రలో పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపించారు. శివ పండిట్, అన్బు తాసన్, యోగ్ జపీ కీలక పాత్రల్లో కనిపించారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ స్టైలిష్, కాంటెంపరరీ విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. యాక్షన్, అడ్వెంచర్ ప్రపంచాన్ని యాటిట్యూడ్‌తో ప్రజెంట్ చేశారు. ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఇంటెన్సిటీ, ఎనర్జీని తీసుకొచ్చింది. ప్రవీణ్ కేఎల్ షార్ప్ కట్స్‌తో నెరేషన్‌ను క్రిస్ప్‌గా ఉంచారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. యాక్షన్‌తో కూడిన హీస్ట్ కథ, జేసన్ సంజయ్ డైరెక్టోరియల్ డెబ్యూ, సందీప్ కిషన్ లీడ్ పెర్ఫార్మెన్స్తో ‘సిగ్మా’ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
17/9/2026, 4:09:00 pm
హిట్ మెషిన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి సెకండ్ సాంగ్ ‘వెవెలా ఊహలే చూపినా..’ సాంగ్ రిలీజ్ - అక్టోబర్ 9న సినిమా భారీ విడుదల అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాలయా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీకరణను జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, రీసెంట్గా రిలీజైన ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘వెవెలా ఊహలే చూపినా..’ను రిలీజ్ చేశారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఈ పాటను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘వెవెలా ఊహలే చూపినా..’ సాంగ్ నేపథ్యం విషయానికి వస్తే..తమకు కావాల్సిన ఓ అరుదైన బాక్స్ కోసం విలన్ గ్యాంగ్ వెతుకుతుంటుంది. అది హీరో, హీరోయిన్ దగ్గర ఉందని వారు భావిస్తుంటారు. అదే సమయంలో వాళ్లు విలన్స్ కంటపడతారు. మరోవైపు హీరో చేతిలో గన్ ఉంటుంది..అది ఊహించని రీతిలో పేలుతుంది. దీంతో హీరోహీరోయిన్లపై గ్యాంగ్ రివర్స్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో రేట్రో స్టైల్లో ‘వెవెలా ఊహలే చూపినా..’ సాంగ్ ప్లే అవుతుంటుంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీత సారథ్యంలో ఈ సాంగ్‌ను కిట్టు విస్సాప్రగడ రాయగా..శ్రీ సాగర్ పాడారు. పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, మ్యూజిక్‌తో ఆసాంతం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకు రిలీజైన మా బా బా బ్లాక్ షీప్ మూవీ టీజర్, అజా మేరీ జాని సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘వెవెలా ఊహలే చూపినా..’ అనే సాంగ్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. డిఫరెంట్ స్టైల్లో సాగే పాట ఇది. ఈ సాంగ్‌ను రిలీజ్ చేసిన మా అనిల్ రావిపూడిగారికి థాంక్స్. సినిమాను అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. మేఘాలయాలోనే పూర్తి సినిమాను కంప్లీట్ చేశాం. అక్కడే మొత్తం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తొలి సౌత్ మూవీ ఇదే. ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లోనూ చిత్రీకరించాం. పక్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్టర్ గుణి, నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ఎంటైర్ టీమ్ సహకారంతో ఇది సాధ్యమైంది’’ అన్నారు. నటీనటులు : టిను ఆనంద్, ఉపేంద్ర , జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ, అభినవ్, శుభలేఖ సుధాకర్, హర్ష, కిషోర్ కృష్ణ, విస్మయశ్రీ, మాళవి, సమృద్ధి, విష్ణు ఓయ్, కశ్యప్, రాజా రవీంద్ర, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనీష్ కురివిల్లా, కాదంబరి కిరణ్ తదితరులు సాంకేతిక బృందం : బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్ నిర్మాత : వేణు దోనేపూడి సహ నిర్మాత: కొండల్ జిన్నా దర్శకత్వం : గుణి మంచికంటి క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్వేత దోనేపూడి మ్యూజిక్ : ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో ఆర్ట్ : సాహి సురేష్ ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు కెమెరామెన్ : అజయ్ అబ్రహం జార్జ్ కో డైెరెక్టర్ : కిషోర్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైశాఖ్ నాయర్, శ్రీద దోనేపూడి కాస్ట్యూమ్స్ : ప్రియాంక శ్రీనివాస్ కొరియోగ్రఫీ : జెడి. మాస్టర్ యాక్షన్స్ : వింగ్ చున్ అంజి పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల
17/9/2026, 12:02:00 am
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్ 'ఆ నలుగురు', 'మధుమాసం', 'అందరి బంధువయా', 'ఇదీ సంగతి', 'ఆటగదరా శివా' తదితర సినిమాలతో విలక్షణ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తెరకెక్కించిన తాజా సినిమా 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు'. ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా... అనేది ఉపశీర్షిక. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ''ఇంత పెద్ద టైటిల్‌తో సినిమా రావడం ఇంట్రెస్టింగ్గా ఉంది. చంద్ర సిద్ధార్థ్ గారి దగ్గర 'మధుమాసం', 'హౌస్‌ఫుల్', 'అందరి బంధువయా' చిత్రాలకు నేను స్క్రిప్ట్ విభాగంలో పని చేశాను. ఆయన సెన్సిబుల్ సినిమాలు తీశారు. పొడవాటి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. దర్శక నిర్మాత చంద్ర సిద్దార్థ్ మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మేం అడిగిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన బిజీ షెడ్యూల్లో మాకు కొంత టైమ్ ఇచ్చారు. ఆయనకు టైటిల్, టీజర్ నచ్చడం పాజిటివ్ సైన్. మాకు సంతోషంగా ఉంది. టైటిల్ రెస్పాన్స్ బావుంది. ఆడియన్స్ అందరిలో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుంది. థియేటర్లలో మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు. హర్ష హీరోగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి హీరోయిన్లుగా పరిచయమవుతున్న 'ఈ పాట కోరినవారు...' సినిమాలో ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్ విషయానికి వస్తే... 'నీ రేడియో కావాలి' అంటూ హీరో హర్ష ఒకరి ఇంటికి వెళతాడు. అక్కడ రేఖా నిరోషా 'నేను వద్దా' అని అడుగుతారు. అది చూసి ఆమె భర్త ఓ లుక్ ఇస్తారు. తర్వాత 'ఇంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎలా వదులుకున్నారు' అని ఇనాయ సుల్తానాను అడిగితే... 'ఎప్పుడూ మీరే వదిలేయాలా? మేం వదలకూడదా' అని ఆమె సమాధానం ఇస్తారు. ప్రేయసిని షేర్ చేసుకోవాలనుకునే ప్రియుడు, పెళ్లి పీటల మీద భర్తతో పాటు మరొకరు కావాలని కోరిన భార్య వంటి సన్నివేశాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ మీద అంచనాలు పెంచాయి. 'ఆ నలుగురు'తో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ రూపొందిన చిత్రమిది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమరీస్, గిల్ట్ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది. హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా, సన్నీ, గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: మదన్, సంగీతం: జే రెక్స్, పాటలు: చంద్ర సిద్ధార్థ్, మాటలు: పులగం చిన్నారాయణ, ఆర్ట్: అంజి కొయ్యల, సినిమాటోగ్రఫీ: సామ్ సుప్రీత్ , ఎడిటింగ్: బొబ్బిలి భానుప్రకాశ్, గిరిధర్, సహ నిర్మాతలు: అగస్త్య మంజు, సాగర్, మహి, సమర్పణ: వై.వి.సత్యనారాయణ రాజు, నిర్మాత - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ్.
7/9/2026, 6:29:00 pm
ఒక గొప్ప కథకుడు ఆడే మానసిక చదరంగంలోకి అడుగుపెట్టండి! డాక్టర్ ప్రవీణ్ యజ్జల రచించిన "స్క్రీన్ ప్లే మాస్టర్ - సుకుమార్" పుస్తకాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నాం. ప్రపంచ స్థాయి సినిమా సిద్ధాంతాలను మన అచ్చమైన తెలుగు భావోద్వేగాలతో మేళవించిన దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే నైపుణ్యంపై చేసిన అద్భుతమైన విశ్లేషణ ఇది.