Skip to main content

నేచురల్ స్టార్ నాని ప్రెజెంట్స్, హీరో నితిన్ 'అలియాస్ రుక్మిణి' షూటింగ్ పూర్తి- డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్

నేచురల్ స్టార్ నాని ప్రెజెంట్స్, హీరో నితిన్ 'అలియాస్ రుక్మిణి' షూటింగ్ పూర్తి- డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్

బ్లాక్‌బస్టర్ సక్సెస్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'అలియాస్ రుక్మిణి' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో రొమాన్స్, హ్యూమర్, ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో నితిన్‌తో పాటు చిత్ర బృందం షూటింగ్ కంప్లీషన్‌ను సెలబ్రేట్ చేసుకుంది. సెట్స్‌లో చిత్ర యూనిట్ అంతా కలిసి ఆనందంగా గడిపిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.

సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’తో ప్రారంభించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌లో రుక్మిణిపై కృష్ణకు ఉన్న ప్రేమను అందంగా ఆవిష్కరించారు. ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ సినిమాటోగ్రాఫర్‌గా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడిగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: నితిన్, ఆఫియా సయ్యద్, సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు

సాంకేతిక బృందం సమర్పణ: నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ బ్యానర్: యునానిమస్ ప్రొడక్షన్స్ రచన, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్ నిర్మాత: దీప్తి గంటా సినిమాటోగ్రఫీ: జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ సంగీతం: విజయ్ బుల్గానిన్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎడిటర్: సృజన అడుసుమిల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గరపు పబ్లిసిటీ డిజైనర్: భరణీధరన్ మార్కెటింగ్: ఫస్ట్ షో పీఆర్వో: వంశీ-శేఖర్

View all →

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #RaPo23 ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ ప్రీ-లుక్ రిలీజ్.. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్