Skip to main content

మెగాస్టార్‌తో డేట్‌కు రెడీనా? త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘చిరంజీవీస్ మెగావర్స్’!

మెగాస్టార్‌తో డేట్‌కు రెడీనా? త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘చిరంజీవీస్ మెగావర్స్’!

మెగాస్టార్ ఎంట్రీ ఇస్తున్నారంటే చాలు.. థియేటర్లలో విజిల్స్, ఈలలు, చప్పట్లతో మారుమోగిపోవాల్సిందే. 48 ఏళ్లుగా తరతరాల అభిమానుల్లో అదే ఉత్సాహం, అదే క్రేజ్ కొనసాగుతోంది. ఇటీవల ‘చిరా__జీవి’ అనే పేరు కనిపించగానే చాలామంది మరోసారి ఆసక్తిగా చూశారు. ఆ పేరులో మిస్సైన ‘ఎన్’ కూడా మెగాస్టార్ తదుపరి ప్రయాణం ఎక్కడికి వెళ్లబోతోందో చెప్పే చిన్న క్లూ!

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో విశేషం రాబోతోంది. చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న సరికొత్త టాక్ షో ‘చిరంజీవీస్ మెగావర్స్’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. సినిమా, క్రీడలు, పాపులర్ కల్చర్‌కు చెందిన ప్రముఖులు ఈ షోలో చిరంజీవితో కలిసి సందడి చేయనున్నారు. ఇప్పటివరకు మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అనుభవాలను వారు ఈ వేదికపై పంచుకోనున్నారు.

దశాబ్దాలుగా ప్రేక్షకులకు తెలిసిన మెగాస్టార్‌ను మాత్రమే ఈ షోలో చూడబోవడం లేదు, ఆయన వెనుక ఉన్న అసలైన వ్యక్తిని కూడా ప్రేక్షకులు తెలుసుకోబోతున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే వ్యక్తిత్వం, ఆసక్తిగా ప్రశ్నలు అడిగే తీరు, చమత్కారమైన మాటలు, వ్యక్తిగత అనుభవాలను పంచుకునే విధానం.. ఇలా చిరంజీవిలోని మరో కోణాన్ని ఈ షో ఆవిష్కరించనుంది. తన అతిథుల మాటలను ఆసక్తిగా వింటూ, వారితో నవ్వుతూ, తనదైన శైలిలో మనసు విప్పి మాట్లాడనున్నారు.

‘ఇది నా అడ్డా’ .. ఈ మాటకు తగ్గట్టుగానే వేదిక మెగాస్టార్‌ ఆయనదైన ప్రత్యేక ప్రపంచంగా ఉండబోతోంది.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ సంస్థలు ఈ షోను నిర్మిస్తున్నాయి. ‘చిరంజీవీస్ మెగావర్స్’ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉండండి. త్వరలోనే, కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో!

View all →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

చరిత్రను తెలుసుకుందాం.. ఫూలే దంపతుల పోరాటానికి తెరపై నివాళి.. నవంబర్ 27న ‘ఫూలే’ తెలుగు ప్రేక్షకుల ముందుకు..

తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో యశ్వంత్